హైదరాబాద్‌కు మరో మెగా ఫ్లైఓవర్! నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మరో కీలక అడుగు పడింది. ఎల్‌బీనగర్ పరిధిలో ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. దీంతో నగర తూర్పు ప్రాంతాల్లో ప్రయాణం మరింత సులభం కానుంది. గాయత్రినగర్, టీకేఆర్ కాలేజ్, మందమల్లమ్మ జంక్షన్‌ల మీదుగా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. సుమారు రూ.416 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నగర మౌలిక వసతుల అభివృద్ధిలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. ప్రస్తుతం బడంగ్‌పేట్, మీర్‌పేట్, అల్మాస్‌గూడ ప్రాంతాల్లో జనాభా వేగంగా పెరుగుతోంది. దీంతో ప్రతిరోజూ భారీ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. కొత్త ఫ్లైఓవర్ పూర్తయితే ఈ ప్రాంతాల ప్రజలకు ప్రయాణ సమయం తగ్గే...