తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీ బస్సు ప్రయాణంలో భారీ మార్పు!
తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళలకు ప్రభుత్వం మరో సౌకర్యాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఆధార్ కార్డు చూపించి ప్రయాణిస్తున్న మహిళలు ఇకపై ప్రత్యేక స్మార్ట్ కార్డు ద్వారా ఉచిత టికెట్ పొందే అవకాశం కలగనుంది. ప్రస్తుతం ఈ పథకానికి అర్హులైన మహిళల వివరాల సేకరణ పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే వారికి ప్రత్యేక స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్డులు ఏటీఎం కార్డు తరహాలో ఉండనున్నాయి. కార్డులో మహిళల ఫోటో, ఆధార్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం చిప్ రూపంలో అనుసంధానం చేయనున్నారు. దీంతో ప్రయాణ సమయంలో ఆధార్ కార్డు వెంట...