ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త

తెలంగాణలో సొంతిల్లు కల నెరవేర్చుకోవాలనుకుంటున్న పేద కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎవరూ గుడిసెల్లో జీవించకూడదనే ఉద్దేశంతో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగా, తాజాగా మరో 2.5 లక్షల ఇళ్ల మంజూరు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే సెప్టెంబర్ 17న మరో లక్ష ఇళ్లకు గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తండాలు, గూడేల్లో...