ఏపీలో భారీ వర్షాల ఎఫెక్ట్.. వాతావరణ శాఖ తాజా హెచ్చరిక వైరల్!
ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు ఎండలు మండుతుండగా, మరోవైపు పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ కేరళ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో మంగళవారం, బుధవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీసత్యసాయి,...