అమెరికాలో ఘోర విషాదం.. కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపి ఆరుగురిని హత్య చేసిన వ్యక్తి

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. అయోవా రాష్ట్రంలోని మస్కటీన్ నగరంలో కుటుంబ విభేదాలు దారుణ ఘటనకు కారణమయ్యాయి. ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపి ఆరుగురిని హత్య చేయగా, అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. సోమవారం మధ్యాహ్నం మస్కటీన్ నగరంలోని పార్క్ అవెన్యూలో ఉన్న ఓ ఇంటి నుంచి కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు ఇంట్లో తుపాకీ గాయాలతో పడి ఉన్న నలుగురిని గుర్తించారు. వైద్య సిబ్బంది పరిశీలించగా వారు అప్పటికే మరణించినట్లు...