పవన్ కళ్యాణ్‌ను చూసి భయపడుతున్నారా? విమర్శలకు తెలంగాణ జనసేన కౌంటర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ జనసేన నాయకులు ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని అడ్డుకునే స్థాయిలో ఎవరూ లేరని, ఆయన ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసే కొందరు రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. జనసేన నాయకుడు సాగర్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌ను పదేపదే విమర్శించడం వెనుక రాజకీయ భయం కనిపిస్తోందన్నారు. ఒక సినిమా నటుడు రాజకీయాల్లోకి రావడంలో తప్పేంటని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడిని అతని గత వృత్తి ఆధారంగా విమర్శించడం సరికాదన్నారు. తెలంగాణలో జనసేన కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయని, అదే...