హైదరాబాద్లో జనసేన సభకు పోలీసుల అనుమతి నిరాకరణ
హైదరాబాద్లో జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శేరిలింగంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, జనసేన ప్రతినిధులు సభ నిర్వహణకు అనుమతి కోరుతూ దరఖాస్తు సమర్పించారని తెలిపారు. ఆ దరఖాస్తు ప్రకారం సుమారు రెండు వేల మంది కార్యకర్తలు, అభిమానులు సభకు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు, కొందరు నేతల వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని డీసీపీ పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని అంశాలపై...