క్రెడిట్ కార్డుదారుడు మరణిస్తే బిల్లు ఎవరు కడతారు? ఎవరి బాధ్యత?
క్రెడిట్ కార్డు ఇప్పుడు చాలా మందికి అత్యవసర ఆర్థిక సాధనంగా మారింది. అయితే కార్డుపై బిల్లు పూర్తిగా చెల్లించకముందే కార్డుదారుడు మరణిస్తే ఆ డబ్బు పరిస్థితి ఏమవుతుందనే సందేహం చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఆ బిల్లును కట్టాలా లేదా అనే ప్రశ్న తరచూ వినిపిస్తుంది. సాధారణంగా క్రెడిట్ కార్డు అనేది అన్సెక్యూర్డ్ రుణంగా పరిగణిస్తారు. అంటే ఈ రుణానికి ఇల్లు, భూమి లేదా బంగారం వంటి ఆస్తులు తాకట్టు ఉండవు. అందుకే కార్డు వినియోగానికి సంబంధించిన బాధ్యత ప్రధానంగా కార్డుదారుడిపైనే ఉంటుంది. ఒకవేళ కార్డుదారుడు మరణిస్తే, అతని కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత ఆదాయం లేదా ఆస్తులతో ఆ బిల్లును చెల్లించాల్సిన అవసరం...