బ్యాంక్ ఖాతాదారులకు కీలక సమాచారం.. జూన్ నుంచి మారిన నిబంధనలు ఇవే
కొత్త నెల ప్రారంభంతో పలు కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా యూపీఐ వినియోగదారులు, పన్ను చెల్లింపుదారులు, బ్యాంకింగ్ సేవలు ఉపయోగించే వారు తాజా నిబంధనలపై అవగాహన కలిగి ఉండటం అవసరం. డిజిటల్ లావాదేవీల భద్రతను పెంచేందుకు యూపీఐ వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకువచ్చారు. డబ్బు పంపే ముందు లబ్ధిదారుడి అధికారిక పేరు కనిపించడం వల్ల మోసాలు, పొరపాట్లు తగ్గే అవకాశముంది. కార్డు లేకుండా యూపీఐ ద్వారా ఏటీఎంల నుంచి నగదు తీసుకునే వారికి కూడా కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. ఈ లావాదేవీలు బ్యాంకు నిర్ణయించిన ఉచిత నగదు ఉపసంహరణ పరిమితిలోనే లెక్కించబడతాయి. పరిమితి దాటితే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. పీఎఫ్ ఖాతాదారులకు...