వాట్సాప్ కాల్ రికార్డ్ చేయాలా? ఈ సులభ మార్గాలు తెలుసుకోండి

వాట్సాప్ కాల్స్ ఇప్పుడు వ్యక్తిగత, ఉద్యోగ సంబంధిత సంభాషణల్లో కీలక భాగంగా మారాయి. కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన సమాచారాన్ని భవిష్యత్తు కోసం భద్రపరచుకోవాలనే ఉద్దేశంతో కాల్ రికార్డ్ చేయాలనిపిస్తుంది. అయితే వాట్సాప్‌లో ఇందుకోసం ప్రత్యేక రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో లేదు. ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నవారికి స్క్రీన్ రికార్డర్ ఒక సులభమైన పరిష్కారం. చాలా కొత్త స్మార్ట్‌ఫోన్లలో ఈ ఫీచర్ ముందే అందుబాటులో ఉంటుంది. కాల్ ప్రారంభించే ముందు స్క్రీన్ రికార్డింగ్‌ను ఆన్ చేసి, ఆడియో సెట్టింగ్స్‌ను సరిగ్గా ఎంచుకుంటే సంభాషణను సేవ్ చేసుకోవచ్చు. అయితే కొన్ని ఫోన్లలో భద్రతా కారణాల వల్ల ఇంటర్నల్ ఆడియో రికార్డ్ కాకపోవచ్చు. అలాంటి సమయంలో స్పీకర్ మోడ్‌ను ఉపయోగించి మైక్...