ఫోన్ వేడెక్కుతోందా? ఈ చిట్కాలు పాటిస్తే సమస్యకు గుడ్‌బై!

స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న ఈ కాలంలో ఫోన్ వేడెక్కడం చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యగా మారింది. ముఖ్యంగా ఎక్కువసేపు గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం లేదా అనేక యాప్స్‌ను ఒకేసారి ఉపయోగించడం వల్ల ఫోన్‌పై అదనపు ఒత్తిడి పడుతుంది. దీని ప్రభావం బ్యాటరీపై కూడా కనిపిస్తుంది. ఫోన్‌లో నెట్‌వర్క్ సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పరికరం నిరంతరం కనెక్షన్ కోసం ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలో ఎక్కువ శక్తిని వినియోగించడంతో ఫోన్ వేడెక్కే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వైఫై ఉపయోగించడం లేదా అవసరం లేనప్పుడు ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. చాలామంది తక్కువ ధరకు లభించే నాణ్యతలేని ఛార్జర్లను...