ఢిల్లీ నిరసనకు అబిజీత్ దీప్కే మద్దతు
విద్యార్థులకు సంబంధించిన ప్రవేశ పరీక్షల వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న వేళ, కాక్ రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అబిజీత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. జూన్ 6న ఢిల్లీకి చేరుకుని శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొంటానని వెల్లడించారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోలో ఆయన తన అనుచరులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో నిరసనకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని, విద్యార్థుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి వెళ్లేందుకు సామూహిక స్వరం అవసరమని చెప్పారు. ప్రవేశ పరీక్షల ఫలితాలు, నిర్వహణపై నెలకొన్న అనుమానాలు విద్యార్థుల్లో ఆందోళన పెంచాయని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలపై బాధ్యత వహించాల్సిన అధికారులు స్పందించాలని,...