Phenolphthalein Powder: ఏసీబీ ఉచ్చులో కీలక పాత్ర పోషించే రసాయనం

Phenolphthalein Powder: దేశంలో అవినీతి నిర్మూలన కోసం పనిచేస్తున్న దర్యాప్తు సంస్థలు ఉపయోగించే పద్ధతుల గురించి ప్రజల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా ఎలా పట్టుకుంటారు? వారి చేతులు కడిగినప్పుడు నీరు ఎందుకు గులాబీ రంగులోకి మారుతుంది? అనే ప్రశ్నలు తరచూ వినిపిస్తుంటాయి. దీనికి వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అధికారులు పనుల కోసం లంచాలు డిమాండ్ చేస్తున్న సందర్భాల్లో బాధితులు అవినీతి నిరోధక సంస్థలను ఆశ్రయిస్తారు. ఫిర్యాదు అందిన తర్వాత అధికారులు ప్రత్యేక వ్యూహంతో ఉచ్చుపన్నుతారు. ఈ ప్రక్రియలో ఉపయోగించే రసాయనం అవినీతి కేసుల్లో కీలక సాక్ష్యంగా మారుతుంది....