Crorepati Habits: కోటీశ్వరులు కావాలంటే అదృష్టం కాదు.. ఈ అలవాట్లు కావాలి

Crorepati Habits: జీవితంలో ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలని, భవిష్యత్తులో కోటీశ్వరులుగా ఎదగాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడం వల్ల మాత్రమే సంపన్నులు కాలేరని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. డబ్బు సంపాదించడం ఒక దశ మాత్రమే అయితే, ఆ సంపదను కాపాడుకోవడం, దాన్ని మరింతగా పెంచుకోవడం అసలు సవాల్‌గా మారుతుంది. ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ఆర్థికంగా విజయవంతమైన వ్యక్తుల జీవనశైలిని పరిశీలిస్తే వారు కొన్ని ప్రత్యేకమైన అలవాట్లను క్రమం తప్పకుండా పాటిస్తారని తెలుస్తోంది. ఈ అలవాట్లే వారిని సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరులుగా ఎదగడానికి సహాయపడ్డాయని నిపుణులు పేర్కొంటున్నారు. సంపన్నులుగా ఎదగాలంటే ముందుగా ప్రతి ఒక్కరిలో సేవింగ్స్ అలవాటు...