Vastu Tips: ఇంట్లో ఈ ప్రదేశాల్లో బంగారాన్ని ఉంచకూడదట..!

Vastu Tips: వాస్తు శాస్త్రంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉందని నిపుణులు చెబుతున్నారు. బంగారం కేవలం అలంకరణ కోసం ఉపయోగించే ఆభరణం మాత్రమే కాకుండా, సంపద, ఐశ్వర్యం, శుభానికి ప్రతీకగా భావించబడుతుంది. అందుకే చాలామంది తమ కష్టార్జిత సంపాదనతో బంగారం కొనుగోలు చేసి భద్రంగా ఇంట్లో నిల్వ ఉంచేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే కొన్ని ఇళ్లలో బంగారం ఎక్కువకాలం నిలవకపోవడం, తరచూ పోగొట్టుకోవడం, విరగడం లేదా ఆర్థిక అవసరాల కారణంగా అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో ఉన్న శక్తి, దిశలు, జీవనశైలి, పరిశుభ్రత వంటి అంశాలు కూడా సంపద నిలకడపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. ఇంటి పరిశుభ్రత వాస్తు శాస్త్రంలో...