IPL 2026: ఐపీఎల్ ఫైనల్ మార్పుపై కర్ణాటక ప్రభుత్వం సంచలన ప్రకటన..!

IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్ వేదిక మార్పు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం గత సీజన్‌లో విజేతగా నిలిచిన జట్టు సొంత మైదానంలో తదుపరి ఫైనల్ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది. ఆ లెక్కన ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంత మైదానం అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ జరగాల్సి ఉంది. అయితే తాజాగా బీసీసీఐ విడుదల చేసిన అధికారిక షెడ్యూల్‌లో ఫైనల్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి మార్చినట్లు ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నిర్ణయం వెనుక కేవలం పరిపాలనా కారణాలేనా లేక రాజకీయ ఒత్తిళ్లు...