Operation Sindoor: దేశ భద్రతా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన సైన్యం ఆపరేషన్
Operation Sindoor: దేశ భద్రతా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిన ‘ఆపరేషన్ సింధూర్’కు నేటితో ఏడాది పూర్తైంది. పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు బలైన ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఈ మెరుపు ఆపరేషన్ దేశ ప్రజల్లో భద్రతా నమ్మకాన్ని మరింత బలపరిచింది. శత్రువుల గుండెల్లోకి దూసుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఈ సాహసోపేత దాడి ఇప్పుడు దేశ సైనిక శక్తికి ప్రతీకగా నిలిచింది. ఆపరేషన్‌కు ఏడాది పూర్తైన సందర్భంగా దేశవ్యాప్తంగా సైనికుల ధైర్యసాహసాలను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత సాయుధ దళాల పరాక్రమాన్ని కొనియాడారు. ‘ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న ప్రతి సైనికుడికి దేశం ఎప్పటికీ రుణపడి...