Gold Prices: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తగ్గుదలకు బ్రేక్
Gold Prices: బంగారం ధరల్లో కొనసాగుతున్న తగ్గుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. గత కొద్ది రోజులుగా క్రమంగా తగ్గుతూ వచ్చిన ధరలు బుధవారం అనూహ్యంగా ఎగసిపడ్డాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం మార్కెట్ ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ తీవ్రరూపం దాల్చడం, యుద్ధ వాతావరణం నెలకొనడం వంటి పరిణామాలు బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లడంతో బంగారంపై డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న సమయంలో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఈ ధరల పెరుగుదల గట్టి షాక్‌గా మారింది. కొద్దిరోజులుగా ధరలు...