Astrology Beliefs: సాయంత్రం వేళల్లో ఉప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదని ఎందుకంటారో తెలుసా?

Astrology Beliefs: వాస్తు శాస్త్రం ప్రకారం మన దైనందిన జీవితంలో ఉపయోగించే ప్రతి వస్తువుకూ ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉందని భావిస్తారు. అందులో ముఖ్యంగా ఉప్పుకు సంబంధించిన నియమాలు చాలా కఠినంగా ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ నియమాలను పాటించకపోతే ఇంట్లో ప్రతికూల శక్తులు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత లేదా సాయంత్రం సమయంలో ఉప్పు కొనడం అశుభ సూచకంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో ఉప్పు కొనడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని నమ్మకం ఉంది. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గి, అనవసర ఖర్చులు పెరగడంతో పాటు అప్పుల భారమూ పెరిగే పరిస్థితులు ఏర్పడతాయని వాస్తు శాస్త్రంలో పేర్కొంటారు....