TN Election Results: TVK విజయ్ సంచలనం.. 100కు పైగా స్థానాల్లో టీవీకే ఆధిక్యం
TN Election Results: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. తాజా లెక్కల ప్రకారం తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక అన్నాడీఎంకే 70కు పైగా స్థానాల్లో, డీఎంకే 50కు పైగా స్థానాల్లో ఆధిక్యంతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య విజయ్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం...