FDI: బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

FDI: దేశంలోని బీమా రంగానికి మరింత ఉత్సాహం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీమా సంస్థల్లో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను గరిష్టంగా 100 శాతం వరకు అనుమతిస్తూ ఆటోమేటిక్ విధానంలో ప్రవేశపెట్టిన ఈ తాజా నిర్ణయం ద్వారా విదేశీ పెట్టుబడిదారులకు భారత మార్కెట్‌లో విస్తృత అవకాశాలు లభించనున్నాయి. శనివారం విడుదలైన అధికారిక ప్రకటనలో ఈ నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించారు. అయితే ఈ పెట్టుబడులు తప్పనిసరిగా బీమా చట్టం-1938 పరిధిలోనే ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు, విదేశీ పెట్టుబడులు స్వీకరించే సంస్థలు బీమా లేదా అనుబంధ కార్యకలాపాలు నిర్వహించాలంటే భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ నుంచి అవసరమైన అనుమతులు పొందాల్సి...