SSC Recruitment: 84 పోస్టులతో భారీ నోటిఫికేషన్

SSC Recruitment: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మరో కీలక అవకాశం కల్పించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేయడంతో భాషా నైపుణ్యాలు కలిగిన నిరుద్యోగుల్లో ఆసక్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వంలోని పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అనుబంధ సంస్థల్లో ఖాళీగా ఉన్న అనువాద విభాగ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 84 తాత్కాలిక ఖాళీలను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా హిందీ, ఇంగ్లీష్‌పై పట్టు ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా మారింది. ఈ నియామక ప్రక్రియలో జూనియర్ హిందీ...