PM Kisan Scheme: ఒక్కో రైతు బ్యాంక్ అకౌంట్లోకి రూ.44 వేలు జమ

PM Kisan Scheme: దేశానికి వెన్నెముకగా నిలిచే రైతాంగానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోట్లాది మంది అన్నదాతలకు అండగా నిలుస్తోంది. వ్యవసాయంలో పెట్టుబడి భారాలు, అప్పుల ఒత్తిళ్లు, సాగు వ్యయాల పెరుగుదల మధ్య చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం ఊరటనిస్తోంది. రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమవుతుండటంతో సాగు పనులకు కనీస మద్దతు లభిస్తోంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి నిరంతరంగా లబ్ధి పొందుతున్న అర్హులైన రైతులకు ఇప్పటివరకు ఏకంగా రూ.44,000 అందడం విశేషంగా మారింది. చిన్న మొత్తాలుగా కనిపించినా ఈ సాయం రైతుల దైనందిన సాగు అవసరాల్లో కీలక...