AP: ఆ జిల్లాల్లో ఆదివారం తీవ్ర వడగాలులు..?

AP: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత మరింత పెరుగుతున్న వేళ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని 23 మండలాల్లో ఆదివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురంమన్యం జిల్లాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉండొచ్చని హెచ్చరించారు. విజయనగరం జిల్లాలో బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, వంగర మండలాల్లో వడగాల్పుల ప్రభావం కనిపించే అవకాశముందని పేర్కొన్నారు. అలాగే పార్వతీపురంమన్యం జిల్లాలో బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో కూడా తీవ్ర వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పెరుగుతున్న...