Hero Akshay Kumar: నా కూతురిని నగ్న ఫోటోలు పంపమని అడిగాడు

Hero Akshay Kumar: బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తె నితారా కుమార్‌ను ఆన్‌లైన్‌లో వేధించిన కేసులో మహారాష్ట్ర సైబర్ పోలీసులు కీలక ముందడుగు వేశారు. చిన్నారులను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ వేదికల్లో పెరుగుతున్న ముప్పులపై ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో ఈ కేసులో నిందితుడి అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్ర సైబర్ విభాగం లోతైన దర్యాప్తు అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి యాదవ్ వెల్లడించారు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ భద్రత, ముఖ్యంగా చిన్నారుల డిజిటల్ రక్షణపై మళ్లీ చర్చకు దారితీసింది. గత ఏడాది అక్టోబర్‌లో ముంబైలో నిర్వహించిన ‘సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025’ కార్యక్రమంలో...