Telangana Rastra Sena: కొత్త విప్లవం.. తెలంగాణలో కవిత కొత్త పార్టీ
Telangana Rastra Sena: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటిస్తూ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్ ప్రాంతంలోని అద్వయ కన్వెన్షన్లో నిర్వహించిన సభలో ఆమె పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు వెల్లడించిన కవిత.. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన జెండాను ప్రజల ముందుంచారు. ఆ జెండా మధ్యలో తెలంగాణ ఆకృతిని ప్రతిష్టించి, దానిపై పార్టీ పేరును సూచించే అక్షరాలను ప్రతిబింబించారు. అనంతరం సభలో మాట్లాడిన కవిత తన పార్టీ ఏర్పాటుకు కారణమైన అంశాలను వివరిస్తూ, తెలంగాణ...