Summer: చీమలపై దండయాత్ర.. చంపకుండానే వాటిని తరిమికొట్టే సూపర్ చిట్కాలు
Summer: వేసవి కాలం ప్రారంభమయ్యాక ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు గృహిణులను ఇబ్బంది పెట్టే మరో పెద్ద సమస్య ఎర్ర చీమల ఉపద్రవం. ఇంట్లో ఎక్కడైనా కొద్దిగా పంచదార చల్లినా, అన్నం మెతుకులు పడినా సరే క్షణాల్లోనే వందల సంఖ్యలో చీమలు చేరి ఆహారాన్ని పాడు చేయడమే కాకుండా కుట్టడం వల్ల మంట, దద్దుర్లు కలిగిస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఇది మరింత ఇబ్బందికరంగా మారుతుంది. సాధారణంగా చాలా మంది వీటిని నివారించడానికి రసాయన పదార్థాలను ఉపయోగిస్తుంటారు. అయితే అవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో సహజ పద్ధతుల వైపు మళ్లడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చీమలను చంపకుండా...