Romantic Thriller: పచ్చని కాపురంలో నిప్పులు పోసే మాయ లేడీ.. ఓటీటీలో గత్తరలేపుతోంది సామీ
Romantic Thriller: ఓటీటీ వేదికలు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా విభిన్న రకాల చిత్రాలను అందిస్తూ వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ముఖ్యంగా రొమాంటిక్, బోల్డ్ కథాంశాలతో రూపొందిన సినిమాల కోసం ఒక వర్గం ప్రేక్షకులు ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని వచ్చిన ఒక సంచలనాత్మక విదేశీ చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికపై మంచి ఆదరణ పొందుతోంది. 2024లో విడుదలైన ఫిలిప్పీన్స్ చిత్రం ‘పాలిపట్-లిపట్, పపాలిట్-పాలిట్’ ప్రస్తుతం విపరీతమైన చర్చకు దారి తీసింది. ఈ చిత్రం అక్కడి ‘వివామాక్స్’ ఓటీటీ వేదికలో అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా కథ ఒక చిన్న మత్స్యకార గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ప్రశాంతంగా...