Viral News: మంచు గర్భంలో మహాద్భుతం.. 24 వేల ఏళ్ల తర్వాత కళ్లు తెరిచిన జీవి

Viral News: సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో గడ్డకట్టిన మనుషులు వేల ఏళ్ల తర్వాత మళ్లీ జీవించడం వంటి దృశ్యాలు మనకు ఊహాత్మకంగా కనిపించినా.. ప్రకృతిలో అలాంటి అద్భుతాలు నిజంగానే సంభవిస్తాయని తాజాగా శాస్త్రవేత్తలు నిరూపించారు. సుమారు 24,000 సంవత్సరాల క్రితం మంచు యుగం సమయంలో గడ్డకట్టిన ఒక సూక్ష్మ జీవి నేటి రోజుల్లో మళ్లీ జీవం పొందడం ప్రపంచ శాస్త్ర వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అరుదైన ఘటన రష్యా శాస్త్రవేత్తల పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఈశాన్య సైబీరియాలోని అలజీయా నది పరిసరాల్లో శాశ్వతంగా గడ్డకట్టిన మంచు పొరలను తవ్వినప్పుడు ఈ జీవిని కనుగొన్నారు. రేడియో కార్బన్ పద్ధతితో చేసిన పరీక్షల్లో ఆ మంచు పొరలు...