Telangana: నకిలీ నంబర్ ప్లేట్‌.. బైక్ ఇంట్లో ఉన్నా ట్రాఫిక్ చలాన్లు పడుతున్నాయ్.. ఆరా తీస్తే..

Telangana: హైదరాబాద్ నగరంలో నకిలీ నంబర్ ప్లేట్ ఉపయోగించి వాహనం నడిపిన ఘటన కలకలం రేపింది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ చలానాల నుంచి తప్పించుకునేందుకు ఒక వ్యక్తి తన బైక్ రిజిస్ట్రేషన్ సంఖ్యను కావాలనే మార్పు చేసి వినియోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మదన్నపేట కుర్మగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ రఫీయుద్దీన్ అనే వ్యక్తి తన వాహనానికి ఉన్న అసలు సంఖ్య TG11A1698ను మార్చి TG11A1898గా ఉపయోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మార్పు ద్వారా తనపై నమోదయ్యే ఉల్లంఘనలను తప్పించుకోవాలన్న ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడ్డాడని విచారణలో బయటపడింది. ఈ వ్యవహారం ఒక ఫిర్యాదు ద్వారా వెలుగులోకి రావడం విశేషం. పాత మలక్‌పేట పద్మనగర్‌కు చెందిన షాహీన్...