Sirivennela: ఆడపిల్లల ఆల్ టైమ్ ఫెవరెట్ సాంగ్.. ప్రతీ అక్షరం ఓ అద్భుతమే..
Sirivennela: విక్టరీ వెంకటేశ్ సినీ ప్రయాణంలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ చిత్రంగా నిలిచిన “స్వర్ణ కమలం” 1988లో విడుదలై విశేష విజయాన్ని సాధించింది. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాల గొప్పతనాన్ని అత్యంత అందంగా ఆవిష్కరించింది. కథ, సంగీతం, నృత్యం, భావోద్వేగాల సమ్మేళనంగా నిలిచిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. ముఖ్యంగా “కొత్తగా రెక్కలొచ్చెనా” అనే పాట తన సాహిత్యంతో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ పాటలోని పదాల లోతైన భావాన్ని ప్రముఖ కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి విశ్లేషించిన విధానం ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీస్తోంది. ఈ...