Political: ఒకే రోజు సీఎం, మాజీ సీఎం పర్యటన!
Political: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారాయి. ఏప్రిల్ 20న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఆసక్తి నెలకొంది. కరీంనగర్ తూర్పు ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటన ఉండగా, పశ్చిమ దిశలో మాజీ ముఖ్యమంత్రి సభ జరగనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకేరోజు ఇద్దరు అగ్రనేతలు వేర్వేరు కార్యక్రమాలతో ప్రజల్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిణామాలపై కేంద్రీకృతమవుతోంది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన 7వ బ్లాక్ పిల్లర్లను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్ష...