Tablets: టాబ్లెట్ మధ్యలో ఒక గీత ఎందుకు ఉంటుందంటే?
Tablets: మనము రోజూ వాడే చాలా రకాల మాత్రల మధ్యలో కనిపించే చిన్న గీతను చాలామంది సాధారణ రూపకల్పనగా భావిస్తారు. కానీ వైద్య పరంగా ఈ గీతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని వైద్య భాషలో ‘స్కోర్ లైన్’ అని పిలుస్తారు. ఈ గీతను మాత్రను సరిగ్గా విభజించడానికి ప్రత్యేకంగా ఉంచుతారు. నిపుణుల ప్రకారం, ఈ గీత ఉన్న మాత్రలను అవసరమైన మోతాదుకు అనుగుణంగా రెండు సమాన భాగాలుగా విడగొట్టేందుకు వీలుంటుంది. ఉదాహరణకు ఒక మాత్ర 500 మిల్లీగ్రాముల శక్తి కలిగి ఉండగా, వైద్యుడు 250 మిల్లీగ్రాములు మాత్రమే తీసుకోవాలని సూచిస్తే, ఆ గీత ఉన్న చోట సులభంగా విరిచి సరైన మోతాదును పొందవచ్చు. ఈ...