Dangerous Habit: ముక్కులో వేలు పెట్టి తిప్పితే ఇంత డేంజరా?

Dangerous Habit: చాలా మందికి ఖాళీగా ఉన్నప్పుడు లేదా ముక్కులో అసౌకర్యం కలిగినప్పుడు వేలు పెట్టి తిప్పడం ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది. చాలామంది దీనిని చిన్న విషయంగా తీసుకుంటారు, కానీ వైద్య నిపుణుల హెచ్చరికల ప్రకారం ఈ అలవాటు ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా మెదడు సంబంధిత వ్యాధులపై దీని ప్రభావం ఉంటుందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. అల్జీమర్స్, డిమెన్షియా వంటి జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే వ్యాధులకు ఈ అలవాటు పరోక్షంగా కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ అలవాటును తేలికగా తీసుకోకుండా వెంటనే నియంత్రించుకోవడం అవసరం. మన ముక్కు లోపలి భాగం మెదడుకు అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ కారణంగా ముక్కులో...