Kulkarni Rajaprabhakar Rao: నందిపహాడ్ గ్రామస్థుల అభిమానానికి రుణపడి ఉంటా

Kulkarni Rajaprabhakar Rao: తెలంగాణ రక్షణ సేన కొడంగల్ నియోజకవర్గ ఇంఛార్జ్ కులకర్ణి రాజప్రభాకర్ రావు బుధవారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మద్దూరు మండలం నందిపహాడ్ గ్రామంలో నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసి క్రీడాకారులను అభినందించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన రైడ్ అండ్ రూల్ జట్టుకు మొదటి బహుమతిగా రూ.11,000, కాలాగ్ని జట్టుకు రెండో బహుమతిగా రూ.5,500 అందించారు. ఈ సందర్భంగా కులకర్ణి రాజప్రభాకర్ రావు మాట్లాడుతూ.. నందిపహాడ్ గ్రామస్థులు తనపై చూపిస్తున్న అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ఇంకా అనేక పనులు చేయాల్సి ఉందని, ప్రజల ఆదరణను ఎల్లవేళలా గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు. గ్రామస్థుల...