Veleru: కిడ్స్ లక్ష్మీ గణపతి మండలి ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జనం
స్టార్ త్రినేత్రం, హన్మకొండ: హన్మకొండ జిల్లా వేలేరు మండలంలో బుధవారం గణేశ్ నిమజ్జనం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కిడ్స్ లక్ష్మీ గణపతి మండలి ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడికి నిమజ్జనానికి ముందు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణనాథుడిని శోభాయాత్రగా తరలించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. https://twitter.com/i/status/2103149407646666907 గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో యువతులు, యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తి పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో సందడి చేశారు. గణపతి నామస్మరణలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. 9 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుడికి వీడ్కోలు పలుకుతూ...