Telangana: స్మార్ట్ రేషన్ కార్డు.. పేరుకే స్మార్ట్?
Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులపై లబ్ధిదారుల్లో కొత్త చర్చ మొదలైంది. పాత రేషన్ కార్డులతో పోలిస్తే ఆధునిక రూపంలో, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో కొత్త కార్డులను అందిస్తున్న ప్రభుత్వం.. కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను కార్డుపై ముద్రించకపోవడంపై పలువురు లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేసిన కార్డుల్లో కుటుంబ పెద్ద పేరు తప్ప ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఫొటోలు కనిపించకపోవడంతో ఈ కార్డు వల్ల తమ కుటుంబ వివరాలు ప్రత్యక్షంగా గుర్తించే అవకాశం లేకుండా పోయిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి అభ్యంతరాలు...