Hyderabad: కేటీఆర్, హరీశ్ రావు అరెస్ట్.. ఉద్రిక్తత

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ వద్ద సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ గేటు వద్ద ఆందోళనకు దిగిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం గన్‌పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరిన బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్నారు. అనంతరం అసెంబ్లీలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసేందుకు బీఆర్‌ఎస్ నేతలు నలుపు టీషర్ట్లు ధరించి, ఫ్లకార్డులు చేతబట్టి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని భద్రతా సిబ్బంది, పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ...