Entertainment: ఇరగదీస్తున్న ‘ఇరుముడి’కి ‘టాక్సిక్’ స్పీడ్ బ్రేకర్‌ కానుందా..?

Entertainment: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి జోరును కొనసాగిస్తున్న వేళ, సినిమాకు మరో భారీ సవాల్ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. యశ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ చిత్రం ‘టాక్సిక్’ బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పంపిణీ అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ఇప్పటికే ప్రదర్శితమవుతున్న ‘ఇరుముడి’కి ఎన్ని థియేటర్లు కొనసాగుతాయి, ‘టాక్సిక్’కు ఎన్ని కేటాయిస్తారన్నది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మంచి వసూళ్లతో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’కి థియేటర్ల సంఖ్య తగ్గితే దాని కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ‘టాక్సిక్’ విడుదల రోజున మీలాదునబీ,...