Aruri Ramesh: మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
పంద్రాగస్టు రోజున నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు అరూరి రమేష్ సహా 25 మందిపై కేసు Aruri Ramesh: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్తో పాటు 25 మంది బీఆర్ఎస్ నాయకులపై గురువారం కేసు నమోదైంది. ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేటలో నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించి పలు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేయడంతో పాటు, నేషనల్ హైవేపై అంబేద్కర్ సెంటర్లో ఎలాంటి అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించారని, తద్వారా రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కార్యక్రమంలో డీజే సౌండ్ సిస్టం ఉపయోగించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై...