Aadhaar Card: మీ కుటుంబసభ్యులకు పీవీసీ ఆధార్ ఆర్డర్ చేయడం ఎలా?
Aadhaar Card: భారత పౌరులకు సౌకర్యవంతమైన సేవలను అందించడంలో భాగంగా UIDAI పీవీసీ ఆధార్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణ ఆధార్ కార్డుతో పోలిస్తే మరింత బలంగా, సులభంగా ఉపయోగించుకునే విధంగా ఉండే ఈ పీవీసీ కార్డును కేవలం రూ.75 చెల్లించి పొందే అవకాశం కల్పించింది. ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసుకుంటే కొన్ని రోజుల్లోనే పోస్టల్ శాఖ ద్వారా నేరుగా ఇంటికే చేరే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఒకే మొబైల్ నెంబర్ ద్వారా కుటుంబ సభ్యులందరికీ పీవీసీ ఆధార్ కార్డులను ఆర్డర్ చేసుకునే సౌకర్యం కల్పించడం వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తోంది. పీవీసీ ఆధార్ కార్డులు పొందేందుకు ఆధార్‌కు మొబైల్ నెంబర్...