Telangana: ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం

Telangana: తెలంగాణలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరిగిపోతూ ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. భానుడు ఉగ్రరూపం దాల్చడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకోగా, రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వచ్చే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనితో వడగాల్పుల ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుందని, ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో వడదెబ్బ కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం ఒక్కరోజే...