Health: నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం
Health: ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య భవిష్యత్తులో మహమ్మారిలా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్ ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం.. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 180 కోట్ల మంది ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యాధికి ప్రస్తుతం ఎంఏఎస్ఎల్డీ అనే కొత్త పేరును ఉపయోగిస్తున్నారు. గతంలో దీనిని ఎన్ఏఎఫ్ఎల్డీగా పిలిచేవారు. అంటే మద్యం సేవించకపోయినా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే పరిస్థితి. ఇది ప్రారంభ దశలో చిన్న సమస్యలా కనిపించినప్పటికీ, కాలక్రమేణా తీవ్రమై సిర్రోసిస్ స్థాయికి చేరి కాలేయానికి శాశ్వత...