Canada: పాముల కుంభమేళా.. ఒకే చోట లక్షల పాములు.. చూస్తే వణుకే.. (VIDEO)
Canada: ప్రకృతి తనలో ఎన్నో ఆశ్చర్యాలను దాచిపెట్టుకుంది. వాటిలో కొన్ని మనసును హత్తుకునే అద్భుతాలైతే, మరికొన్ని చూస్తేనే ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు. అలాంటి అరుదైన ప్రకృతి వింతల్లో ఒకటి కెనడాలో ప్రతి సంవత్సరం జరిగే పాముల మహాసమ్మేళనం. లక్షల సంఖ్యలో పాములు ఒకేచోట చేరి సంచరించే ఈ దృశ్యం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను, పరిశోధకులను ఆకర్షిస్తోంది. ఈ విశేషాన్ని చాలామంది “పాముల కుంభమేళా”గా అభివర్ణిస్తున్నారు. కెనడాలోని మానిటోబాలోని నార్సిస్సేలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద సహజ పాముల సమూహానికి నిలయంగా గుర్తింపు పొందింది. ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడి భూగర్భ సున్నపురాయి గుహల నుంచి లక్షలాది రెడ్-సైడెడ్ గార్టర్ పాములు బయటకు వస్తాయి. సాధారణంగా...