MS Dhoni vs Virat Kohli: ఆస్తుల్లో టాప్ ఎవరు..?

MS Dhoni vs Virat Kohli: భారత క్రికెట్‌లో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఇద్దరు దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ. మైదానంలో వీరి ఆటతీరు ఎంత ప్రభావం చూపిందో, మైదానం బయట వారి బ్రాండ్ విలువ, సంపాదన కూడా అంతే స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు కేవలం ఆటతోనే కాదు, వ్యాపారాలు, బ్రాండ్ ఒప్పందాలు, పెట్టుబడుల ద్వారా కూడా భారీ స్థాయిలో ఆస్తులను కూడబెట్టుకున్నారు. దీంతో వీరిలో ఎవరు ఎక్కువ సంపన్నుడు అనే అంశం తరచూ చర్చకు వస్తూనే ఉంటుంది. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించి చరిత్ర సృష్టించిన...