PM Kisan: రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు?.. ఎప్పుడంటే..?

PM Kisan: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. రైతులకు ఆర్థికంగా అండగా నిలిచే ఈ ప్రతిష్ఠాత్మక పథకం కింద 23వ విడత సాయాన్ని జూన్ 20న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా రైతుల్లో ఆనందం నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో 23వ విడత నిధులను విడుదల చేయనున్నారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానం ద్వారా అర్హులైన రైతుల ఖాతాల్లో...