Bima Sakhi Yojana: మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు
Bima Sakhi Yojana: మహిళల ఆర్థిక సాధికారతకు ప్రోత్సాహం కల్పించే దిశగా లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) కొత్త అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందేందుకు, బీమా రంగంలో కెరీర్ను నిర్మించుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన “బీమా సఖి యోజన” పథకం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలకు శిక్షణతో పాటు నెలవారీ ఆర్థిక సహాయం అందించనుండటం విశేషం. ఇంటి వద్ద నుంచే పని చేసే అవకాశం ఉండటంతో అనేక మంది మహిళలు ఈ పథకం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పథకం ప్రధాన లక్ష్యం మహిళలను బీమా రంగంలోకి తీసుకురావడం. ఎంపికైన మహిళలకు బీమా...