Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్రం క్లారిటీ

Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ఆశించిన వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టినా దేశంలో ఇంధన ధరలను వెంటనే తగ్గించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయమంత్రి సురేశ్ గోపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ముడి చమురు ధరల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, శాంతి చర్చలు...