Andhra Pradesh: ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సప్లిమెంటరీ ఫలితాలను ప్రకటించారు. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులు రాసిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీతో పాటు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారిక వెబ్‌సైట్‌ https://bie.ap.gov.in/ లో అందుబాటులో ఉంచింది. ఈసారి విడుదలైన ఫలితాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు మంచి ప్రదర్శన కనబరిచారు. ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల్లో 59 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, రెండో సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల్లో 53...