CM Revanth Reddy: టెక్నాలజీతో పాలన.. తెలంగాణ కేబినెట్ పూర్తిగా డిజిటల్!

CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను ఇకపై పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ డిజిటల్ కేబినెట్ వ్యవస్థ అమలుకు అధికారిక ఆమోదం లభించింది. రాష్ట్ర పరిపాలనను మరింత ఆధునికీకరించడంతో పాటు నిర్ణయాల ప్రక్రియను వేగవంతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. డిజిటల్ కేబినెట్ అమలులో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో...